టీ కప్పులతో మోడీకి విషెష్ తెలిపి ఆకట్టుకున్నారు

నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ 72వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి ప్రపంచ నేతల వరకు ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అభిమానులు , బిజెపి నేతలైతే వినూత్నంగా విషెష్ చెపుతూ తమ అభిమానాన్ని , ప్రేమను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మోడీకి తనదైన శైలిలో విషెష్ చెప్పి వార్తల్లో నిలిచారు.
మోడీ 72వ పుట్టిన రోజు సందర్భంగా ఒడిశా పూరీ బీచ్లో ఒక వెయ్యి 213 మట్టి టీ కప్పులను ఉపయోగించి..మోడీ చిత్రాన్ని రూపొందించాడు. అందులో హ్యాపీ బర్త్డే మోదీ అని రాసుకొచ్చారు. 5 ఫీట్ల పొడవున్న మోడీ ఆకృతి కోసం పట్నాయక్ 5 టన్నుల ఇసుక వాడారు. మోడీ సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక మోడీ బర్త్ డే సందర్భాంగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల సీఎంలు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.