ప్రజలు మళ్లీ బిజెపికే పట్టం కట్టబోతున్నారు

Kanna Lakshminarayana
Kanna Lakshminarayana

విజయవాడ: విజయవాడ ధర్నా చౌక్‌లో బిజెపి నేతలు నిరసనకు దిగారు. ఈ ధర్నాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మోడి ప్రభంజనాన్ని అడ్డుకొనేందుకు రాజకీయ దొంగలంతా ఏకమయ్యారని కన్నా ధ్వజమెత్తారు. కోల్‌కతాలో అమిత్ షా ర్యాలీపై జరిగిన దాడికి నిరసనగా ఈఆందోళన చేపట్టారు. డౌన్ డౌన్ మమతా బెనర్జీ అంటూ నినాదాలు చేశారు.మమత బెనర్జీపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మమతాను సమర్థిస్తున్న చంద్రబాబుపై కూడా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు మళ్లీ బిజెపికే పట్టం కట్టబోతున్నారనికన్నా లక్ష్మీనారాయణ ఆశ భావం వ్యక్తం చేశారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/