రష్యా చేరుకున్న ప్రధాని మోడి


25 ఒప్పందాలపై సంతకాలు చేయనున్న ఇరు దేశాలు

PM Narendra Modi in Russia
PM Narendra Modi in Russia

రష్యా: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడి రష్యా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా తూర్పు దేశాల ఆర్థిక సదస్సుతో పాటు భారత్రష్యా 20వ వార్షిక సదస్సులో మోడి పాల్గొననున్నారు. మొత్తం 25 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి.

మరోవైపు, తన స్నేహితుడు, రష్యా అధినేతతో కలసి జ్వెజ్దా షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్ కు మోడి వెళ్లారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. తన పర్యటనలో భాగంగా, తక్కువ ధరకే ఆయుధాలను తయారు చేసే టెక్నాలజీని భారత్ కు అందించే అంశంపై మోడి చర్చించనున్నారు. ఈ టెక్నాలజీ మనకు అందింతే, తృతీయ శ్రేణి ప్రపంచ దేశాలను భారత్ అతి తక్కువ ధరకే ఆయుధాలను సరఫరా చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఆయుధాల వ్యాపారంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/