కెసిఆర్‌కు మోడీ, తమిళిసై పుట్టినరోజు శుభాకాంక్షలు

కేసీఆర్ కు ఆయురారోగ్యాలు ఉండాలన్న మోడీ

modi-and-tamilisai-greetings-to-kcr

హైదరాబాద్‌ః నేడు సిఎం కెసిఆర్‌ జన్మదినం. ఈరోజు ఆయన 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. మరోవైపు కెసిఆర్ కు ప్రధాని మోడీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పూర్తి ఆయుష్షుతో, మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని మోడీ ట్వీట్ చేశారు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు అని తమిళిసై ట్వీట్ చేశారు.