పరిశుభ్ర భవిష్యత్‌కు మోడీ బాట

3333
Modi 

పరిశుభ్ర భవిష్యత్‌కు మోడీ బాట

నా లుగుసంవత్సరాలక్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019 నాటికి పరిశుభ్ర భార తావని లక్ష్యాన్ని సాధించే దార్శనిక తతో స్వఛ్ఛ భారత్‌ మిషన్‌ను ప్రా రంభించారు. అందుకు తగ్గట్లుగానే 2018 అక్టోబరు రెండవ తేదీ పరి శుభ్రత జాతీయప్రాధాన్యతగాఉండా లంటూ ఎలుగెత్తి చాటిన మహాత్మా గాంధీ జయంతి వార్షికోత్సవం జరుగుతోంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో పరిశుభ్రత విషయంలో భారతదేశం గణనీయమైన ప్రగతినిసాధించింది. 86 మిలియన్ల ఇళ్లలో టాయిలెట్లు నిర్మించా రు.

సుమారు ఐదు లక్షలగ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించారు. సింగపూర్‌ కూడా ఇలాంటి ప్రయాణమే సాగించింది. స్వాతంత్య్రానంతరం మేం మా ప్రజలకు పరిశుభ్రమైన హరిత నివాస పరిసరాలను కల్పించేందుకు ఎంతో కష్టపడి పనిచేసాం. తొలినాళ్లలో ఎన్నో ఇళ్లలో మురుగుతొలగించే సౌకర్యం ఉండేదికాదు. మలవిసర్జితాలను బక్కెట్‌లలో సేకరించి వాటిని ట్రక్కులద్వారా మురుగుశుద్ధి ప్లాంట్లకు తరలించేవారు. తరచూ ఈ మలవిసర్జితాలను దగ్గరలోని నీటిప్రవాహాలలో నదు ల్లో వదలడం వల్ల ఆయా జలాలు కలుషితమై విషపూరితమవు తూ వచ్చాయి. అపరిశుభ్రమైన జీవనపరిస్థితులు ఎన్నో ప్రజారోగ్య సమస్యలకు కారణమయ్యాయి.

తరచూ నీటిసంబంధిత వ్యాధులు ప్రబలడానికి కారణమవుతూ వచ్చాయి. ఇలాంటిపరిస్థితుల్లో మా దేశ నిర్మాతలు నిర్ణయాత్మక చర్యలను తీర్మానించారు. పరిశుభ్ర సింగపూర్‌కు వారు జాతీయ స్థాయి ప్రచారాన్ని ప్రారంభించారు. మేం ప్రతి ఇంటిని పరిశుభ్రంచేసుకున్నాం. మా నదులను పరి శుభ్రం చేసాం. అలా సింగపూర్‌ నీటిని పరిశుభ్రమైన హరిత నగరంగా మార్చాం. ప్రత్యేకించి మేం సింగపూర్‌ నదిని పరిశుభ్రం చేసాం. ఈ క్రమంలో మేం వేలాది ఆక్రమణలను తొలగించాం. బ్యాక్‌యార్డ్‌ పరిశ్రమలను, పందుల ఫారాలను నదీపరీవాహక ప్రాంతాల్లో కాలుష్యానికి కారణమైన ఎన్నింటినో తొలగించాం. ఇవాళ స్వఛ్ఛమైన సింగపూర్‌నది, సింగపూర్‌నగరం గుండా ప్రవ హించి మారినా రిజర్వాయర్‌లో కలుస్తున్నది. ఇది మా జాతీయ నీటిసరఫరా వ్యవస్థకు ఆధారంగా ఉంది. సింగపూర్‌తో పోలిస్తే భారత్‌ ఖచ్చితంగా ఎంతో వైవిధ్యంతో కూడికున్నది. గంగానది సింగపూర్‌ నదికంటే దాదాపు వెయ్యిరెట్లు పెద్దది. అయినా పరి శుభ్రతా ప్రయాణంలో ఇండియా, సింగపూర్‌లకు పోలికలున్నాయి. ముందుగా ఇరుదేశాల అనుభవాలు దేశ దార్శనికత, నాయకత్వ ప్రాధాన్యతను ప్రస్ఫుటంచేస్తున్నాయి.

దివంగత సింగపూర్‌ ప్రధాన మంత్రి లీకాన్‌యూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీలు ఇరు వురూ తమ దేశం పరిశుభ్రంగా ఆకుపచ్చగా ఉండాలనేది తమ ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. ఈ విషయంలోప్రచారం నిర్వహించ డానికి ప్రజలను కూడగట్టడానికి ప్రజలను చైతన్యవంతులను చేయ డానికి వ్యక్తిగతంగా నాయకత్వం వహించారు. ఇరువురు నేతలూ ప్రజలతో కలిసి వీధులు శుభ్రంచేయడానికి చీపుర్లు చేతపట్టారు. లీ తనకు వ్యక్తిగతంగాప్రేరణ అని మనం ఉన్న తీరులో మార్పు తేవడం ద్వారా దేశ పరివర్తన సాధించవచ్చన్న లీ ఆలోచన నుంచి స్ఫూర్తి పొందానని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చెప్పారు. ఆరకంగా స్వఛ్‌భారత్‌ మిషన్‌ కేవలం భారత దేశ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం మాత్రమేకాదు. మన ఆలోచన, మనపని, మనజీవన విధానంలో పరివర్తన తెచ్చే లోతైన సంస్కరణ.

ఇక రెండవది విజయం సాధించాలంటే అందుకు జాతీయ స్థాయిలో దీర్ఘకాలిక నిబద్ధత ఉండాలి. సింగపూర్‌ తమ మురుగునీరు నీటిపారుదల నెట్‌వర్క్‌లను వేరుచేసే సీవరేజ్‌ మాస్టర్‌ప్లాన్‌ను అమలుచేసింది. దీని లక్ష్యం వర్షపునీరు కలుషితం కాకుండా నిరోధించడం ఈ నీటిని సేకరించి సద్వినియోగం చేసుకోవడం అదే సమయంలో సింగపూర్‌ ఒకసారి వాడిన నీటిని మురుగునీటిశుద్ధియూనిట్‌లతో శుద్ధిచేసి తిరిగి వాడుతుంది. ఈ నీటిని రివర్స్‌ ఆస్మోసిస్‌ద్వారా శుద్ధిచేసి ఎన్‌ఇ వాటర్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇది అత్యంత పరిశుభ్రంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన మంచినీరుగా ఉంటుంది. మేం ఒక సమస్యను ఎంపిక చేసుకున్నాం, ఒకసారి వాడిననీటిని ఏంచేయాలనేది ఈ సమస్య. దీనికి పరిష్కారం సాధించాం. ఇది నీటికొరత అనే మరో సమస్యకు కూడా పరిష్కారం అయింది.

భారత దేశంలో వివిధ వర్గాల భాగస్వాములతో అంటే పారిశ్రామిక సంస్థలు పాఠ శాలలు వంటి వాటితో కలిసి దేశవ్యాప్తంగా స్వఛ్ఛ భారత్‌మిషన్‌ అమలు ను ముందుకు తీసుకుపోవడం వంటి వాటితో ఆశాజనకమైన పలితాలనిచ్చింది. 2006లో 50శాతం పాఠశాలల్లో మాత్రమే పారిశుధ్య సౌకర్యాలుండగా ప్రస్తుతం భారత దేశంలోని దాదాపు అన్ని పాఠశాలల్లో పారిశుధ్య సౌకర్యాల కల్పన జరిగిందని 2018 యునిసెఫ్‌డ్రింకింగ్‌ వాటర్‌ శానిటేషన్‌; హైజిన్‌ ఇన్‌స్కూల్స్‌ గ్లోబల్‌ బేస్‌లైన్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. మూడవది సింగపూర్‌ ఇండియాలు రెండూ అంతరక్జాతీయ సహకారానికి విలువనిస్తాయి. ఒకేచోట పరిష్కారం అనుకున్నది మరోదేశంలో పనిచేయకపోవచ్చు. కానీ మనం ఇతరులనుంచి నేర్చుకోవడం, వారి అనుభవాలను పంచుకో వడం వల్లప్రయోజనం పొందవచ్చు. మహాత్మాగాంధీ ఇంటర్నేషన ల్‌ శానిటేషన్‌ కన్వెన్షన్‌ప్రారంభోత్సవానికి ఆతిథ్యమిచ్చినందుకు భారత దేశాన్ని నేను అభినందిస్తున్నాను.

ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు, ప్రాక్టీషనర్లు, నాయకులను పారిశుధ్య రంగంలో తమ అనుభవాల గాథలను పంచుకోవడానికి వారిని ఒకచోటచేర్చిం ది. సింగపూర్‌కూడా ద్వైవార్షిక ప్రపంచ నగరాల శిఖరాగ్ర సమ్మేళ నం, సింగపూరో అంతర్జాతీయ జలవారోత్సవం వంటి అంతర్జా తీయ వేదికలకు ఆతిథ్యమిస్తోంది. 2013లో ప్రపంచ పారిశుధ్య సవాలుపై అవగాహన కల్పించడానికి, నవంబరు 19 వరల్డ్‌ టాయి లెట్‌డేను గుర్తుచేసుకుంటూ ఐక్యరాజ్యసమితి, అందరికీ పారిశు ధ్యం పేరుతో సింగపూర్‌ తీర్మానంచేసింది. ఇండియా మరింత మెరుగైన జీవనానికి దేశవ్యాప్తంగా సుస్థిర స్మార్ట్‌నగరాల అభివృద్ధి కొనసాగిస్తున్నందున సింగపూర్‌ తన అనుభవాలను ఇండియాతో పంచుకోవడం సంతోషంగా భావిస్తోంది.

నగరప్లానింగ్‌, నీటిసర ఫరా, వ్యర్ధాల నిర్వహణ, వంటి అంశాలపై వందలాదిమంది అధి కారులకు శిక్షణ ఇవ్వడానికి సింగపూర్‌, భారత దేశ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌సంస్థతో కలిసి పనిచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌,మహారాష్ట్రవంటి రాష్ట్రాలు తమ నగరాలను అభివృద్ధిచేసుకోడానికి నగరాల సమస్య లకు తగిన పరిష్కారాలు సూచించడంలో సహకారం అందించడా నికి సింగపూర్‌ ఎదురుచూస్తోంది. పరిశుభ్ర భారత్‌నిర్మించేందుకు చేపట్టిన స్వఛ్‌భారత్‌ మిషన్‌ విషయంలో భారత ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.మనదేశా ల రాబోయే తరాలకు పరిశుభ్రమైన నీరు,పారిశుధ్యం అందించే ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఇరు దేశాలమధ్య మరింత సహకారానికి నేను ఎదురుచూస్తున్నాను.

– లీ సియన్‌ లూంగ్‌, (రచయిత: సింగపూర్‌ ప్రధానమంత్రి)