అవిశ్వాసం ఎందుకో చెప్పలేకపోయారు

MODI
MODI

అసలు అవిశ్వాసం ఎందుకో చెప్పలేకపోయారు

-షాజహాన్‌పూర్‌ ర్యాలీలో ప్రధాని మోడీ

షాజహాన్‌పూర్‌ (యుపి): ఎన్‌డిఎప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ఎం దుకు ప్రతిపాదించారో కారణం చెప్పలేకపోయారని, ఆ లోటు కనిపించ నీయకుండా ఉండేందుకే రాహుల్‌ తనను హత్తుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో శనివారం జరిగిన కిసాన్‌ కళ్యాణ్‌ ర్యాలీలో మోడీ మాట్లాడుతూ అవిశ్వాసం ప్రతిపాదించడా నికి గల కారణాలు అడిగామని,ప్రతిపక్షాలు తమకు సమాధానం ఇవ్వడంలో ఘోరంగా విఫలం అయ్యాయని,చివరకు తాను అనుకోని విధంగా ఆలిం గనం ఒక్కటే తనకు కనిపించిందనిమోడీ ఎద్దేవాచేసారు.

అవిశ్వాసం ప్రతిపాదనలో తన ప్రసంగం ముగించిన తర్వాత నేరుగాప్రధానిమోడీ స్థానం వద్దకు వెళ్లి అనూహ్యంగా ఆయన్ను కౌగలించుకన్నారు. టిడిపి ఆధ్వర్యంలోప్రతిపాదించిన ఈ అవిశ్వాసతీర్మానాన్ని వివిధ ప్రతిపక్షాలు సమ ర్ధించిన సంగతి తెలిసిందే. మోడీ బిజెపి ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఈ అవిశ్వాసాన్ని మూడొంతుల మెజార్టీతో నెగ్గింది.

బిజెపికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలన్నీ ఏకం అయినా అవిశ్వాసంలో ప్రభుత్వమే నెగ్గిందని ప్రధాని పేర్కొన్నారు. పేదలను విస్మరించారని,యువత, రైతులను సైతం నిర్లక్ష్యంచేసారని మోడీ ప్రధానంగా కాంగ్రెస్‌పైనే ధ్వజమెత్తారు. ఒక్కొక్కపార్టీ మరో పార్టీతో కలిసి ప్రతిపక్షానికి వచ్చాయని, ఈపార్టీలన్నీ చిత్తడినేల వం టివి అయితే ఆ భూమిలో కమలం వికసిస్తుందనిమోడీ చెప్పారు. కమలం బిజెపికి అధికార గుర్తు అన్న సంగతి తెలిసిందే. రైతులకు సహకరించేందుకు గత పాలక ప్రభుత్వాలకు చిత్తశుద్ధకరువయిందని అన్నారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమంకోసం చేపట్టిన కీలక నిర్ణయాలను ఆయన ఏక రువుపెట్టారు.