ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షపాతం

Rainfall in AP
Rainfall in AP

విశాఖ: ఏపిలోని కోస్తా ప్రాంతంలో అక్కడక్కడా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతం మీదుగా ఉత్తర కోస్తా వైపు తేమ గాలులు వీస్తున్నాయి. మరోవైపు ఉత్తరాది నుంచి పయనిస్తున్న వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ ప్రభావంతో పడమర దిశవైపు నుంచి కూడా పొడి గాలులు వస్తున్నాయి. రెండు వైపులా గాలులు ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో ఉత్తర కోస్తాలో ముసురు వాతావరణం నెలకొని అనేకచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కూడా అక్కడక్కడా వర్షాలు కురిశాయి. కర్నూలులో 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/