జమ్మూకశ్మీర్‌లో మొబైల్‌ సేవలు


సాధారణ ప్రజా జీవనం ఆరంభం

jammu ardinary life
jammu ardinary life


శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న తర్వాత నెలకొన్న ఉద్రిక్తల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో నియంత్రణలు, ఉద్రిక్తతల నుంచి తేరుకుని, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కమ్మూనికేషన్స్‌ వ్యవస్థలపై ఇప్పటివరకూ ఆంక్షలు విధించగా గురువారం జమ్ములోని 5 జిల్లాల్లో మొబైల్‌ సేవలను పునరుద్ధరించారు. స్కూళ్లు, కాలేజీలు సహా విద్యాసంస్థలు తెరుచుకున్నా విద్యార్థుల పూర్తిగా హాజరు కావడం లేదు. కాగా సుప్రీంకోర్టు అనుమతించడంతో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శ్రీనగర్‌ను సందర్శించనున్నారు. ఏచూరి తన పర్యటనలో భాగంగా తమ పార్టీ ఎమ్మెల్యే యూసఫ్‌ తరిగామితో భేటీ కానున్నారు. కాగా, జమ్ముకశ్మీర్‌కు ఐదుగురు సభ్యులతో కూడిన మంత్రుల బృందాన్ని (జిఓఎం) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జిఒఎంలో కేంద్ర మంత్రుల రవిశంకర్‌ప్రసాద్‌, తవర్‌చంద్‌ గెహ్లోత్‌, జితేందర్‌ సింగ్‌, నరేందర్‌ తోమర్‌, దర్మేంద్ర ప్రధాన్‌లు సభ్యులుగా ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/telengana/