తరగతిలో మొబైల్‌ ఫోన్‌ నిషేధం మంచిదే!

Mobile Ban in Class Rooms
Mobile Ban in Class Rooms

ఇ టీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవిద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా అనేక సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగానే పాఠశాల పనివేళ్లలో ఉపాధ్యాయులు ముఖ్యంగా తరగతిగదుల్లో అనగా బోధనాసమయంలో మొబైల్‌ ఫోన్లను వాడడం నిషేధిస్తూ పలువ్ఞరు జిల్లా విద్యాశాఖాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో సి.ఎస్‌.సి వారి ఆర్‌.సి.నెం 138/ఇ1- 1/2013 విడుదల చేసిన ఉత్తర్వులను కోడ్‌ చేస్తూ పలువ్ఞరు జిల్లా విద్యాశాఖాధికారులు ఇటీవల కొత్తగా ఈ విషయమై ఉత్తర్వులు విడుదల చేస్తున్నారు. అయితే 2013లో సి.ఎస్‌.సి వారు విడుదల చేసిన ఉత్తర్వులో రెండే విషయాలు స్పష్టంగా ఉన్నాయి. మొదటిది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొబైల్‌ ఫోన్‌ వాడకం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయడమైంది.

రెండవది ప్రభుత్వ ఉపాధ్యాయులు డ్రెస్‌కోడ్‌ను తప్పకుండా పాటించాలని ఆదేశించడమైనది. కానీ వాస్తవానికి ఈ రెండు ఆదేశాలు ఇంతవరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అమలుకావడం లేదని చెప్పగలం. ఇటీవల కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తరగతిగదిలో ఉపాధ్యాయుడు ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్‌లను వాడకూడదని స్పష్టంగా ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైంది. వీరి చర్యలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో కూడా ఈ విషయమై ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రభుత్వం, పాఠశాలలో అనగా తరగతి గదుల్లో ముఖ్యంగా బోధనాసమయాల్లో ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు మొబైల్‌ఫోన్‌ వాడకం నేరంగా భావిస్తూ చర్యలు తీసుకోవడానికి సిద్ధమవ్ఞతున్నది. ఒకవేళ ఎవరైనా ఉపాధ్యాయుడు ఆ విధంగా ఫోన్‌ వాడుతూ పట్టుబడితే ఆ ఉపాధ్యాయునిపై సి.సి.ఇ రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీనివల్ల విలువైన బోధనా సమయంలో మరింత విలువైన బోధనను ఉపాధ్యాయులు పిల్లలకు అందించే పరిస్థితి ఉంటుంది. తద్వారా పిల్లల్లో గుణాత్మక విద్యను సాధించడానికి నూటికి నూరుశాతం అవకాశం ఉంటుంది.

పిల్లల్లో సృజనాత్మకశక్తి, ఆలోచనా విధానాన్ని పెంపొందించడానికి ఆన్‌లైన్‌ బోధనా విధానాల ద్వారా నెరవేరుతుందని చెప్పొచ్చు. అంటే ఈ రోజున ఏ వ్యవస్థ అయినా నూటికి నూరు శాతం ఆన్‌లైన్‌ విధానంలోనే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. దానికేమీ విద్యావ్యవస్థ మినహాయింపు కాదు. అకడమిక్‌ పరంగా ఉన్నతపాఠశాలలో అయితే పీరియడ్స్‌వారీగా ఉపాధ్యాయులు బోధన చేపడతారు. అంటే కొన్ని పీరియడ్స్‌లో వారికి ఖాళీ దొరు కుతుంది. అలాంటప్పుడు కేవలం తరగతిగదిలో ఉన్నప్పుడు మాత్రమే మొబైల్‌ ఫోన్లను వాడటం నిషేధిస్తూ చర్యలు తీసుకోవాలి. మిగతా ఖాళీ సమయాలలో ఉన్నతపాఠశాల ఉపాధ్యాయులు పిల్లల్లో సృజనాత్మకశక్తిని పెంపొందించేందుకు సరైన ప్రామాణికబోధన చేపట్టేందుకుగాను తగు విషయాలను స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఉపాధ్యాయుడు సమకూర్చుకోవచ్చు.

అలాగే ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫోన్ల వాడకంలో వెసులుబాటు కల్పించాలి. ఎందుకంటే నేడు అనేక ప్రజోపయోగ కార్యక్రమాలను విద్యాశాఖలో నిర్వహిస్తున్నారు కూడా. ఆయా కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయంతంగా నిర్వహించాలంటే తప్పకుండా స్మార్ట్‌ఫోన్ల అవసరం ఉంది. కార్యక్రమాలకు సంబంధించిన వివిధ సమాచారాలను ఎప్పటికప్పుడు సేకరించి సంబంధిత విద్యాశాఖకు పంపించాలి. ఒకవేళ ఈ స్మార్ట్‌ఫోన్లను నిషేధించినట్లయితే సంబంధిత సమాచారం రాష్ట్ర విద్యాశాఖకు చేరుతుందా! దీనిని కూడా గమనించాల్సిన అవసరం సంబంధిత అధికారులపై ఉంది. మొబైల్‌ ఫోన్ల వాడకం కేవలం తరగతిగదుల వరకు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుంది. అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి పాఠ్యబోధన నిమిత్తం వెళ్లి తిరిగి బయటకు వచ్చేవరకు మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ల వాడకం నిషేధం విధించాలి. పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు తమ స్మార్ట్‌ఫోన్లను ఉపాధ్యాయులు అందచేసి తర్వాత బోధనాసమయం ముగిశాక తీసుకునేటట్లు చర్యలు తీసుకోవచ్చు. దానివల్ల ఉపాధ్యాయులకు కానీ, విద్యార్థులకు కానీ, విద్యాపాలనకు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని నిస్సందేహంగా చెప్పగలం. ఈ విషయమై మరొక్కసారి ఆలోచించి మొబైల్‌ ఫోన్ల వాడకం నిషేధం ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తే ఇబ్బందులు ఎలా ఉంటాయోనన్న అంశంపై మేధావ్ఞల కమిటీ ద్వారా నిర్ణయానికి వస్తే బాగుంటుంది.

  • పిల్లా తిరుపతిరావు