నేడు నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

Cancellation of MMTS services
mmts train

నగరవాసులకు అలర్ట్ జారీ చేసింది దక్షిణ మధ్య రైల్వే . ఈరోజు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.పలు మార్గాల్లో ట్రాక్ మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా శుక్రవారం ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం 19 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. నగరంలో మెట్రో అందుబాటులోకి రాకముందు నగరవాసులు ఎక్కువగా ఎంఎంటీఎస్ రైళ్లలోనే ప్రయాణించేవారు. ప్రతి రోజు లక్షల్లో ఆఫీసులకు , వారి గమ్యస్థానానికి చేరుకునే వారు. కానీ మెట్రో ప్రారంభం అయినదగ్గరి నుండి ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య భారీగా తగ్గింది. దీంతో పలు సర్వీస్ లను రద్దు చేస్తూ వస్తుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ మధ్య అయితే పట్టుమని పది సర్వీస్ లు కూడా నడవడం లేదు. వీకెండ్ లలో చాల సర్వీస్ లను రద్దు చేస్తుంది. అసలు ఏ రోజు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయో..నడవడం లేదో అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది.

ఇక ఈరోజు శుక్రవారం ఏకంగా 19 సర్వీస్ లను రద్దు చేస్తున్నట్లు తెలిపి షాక్ ఇచ్చింది. పలు మార్గాల్లో ట్రాక్ మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా శుక్రవారం ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం 19 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. రద్దు చేసిన ఎంఎంటీఎస్ రైళ్ల విషయానికొస్తే.. లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో 6 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 5 సర్వీసులు, హైదరాబాద్-లింగపల్లి మార్గంలో 3 సర్వీసులు ఉన్నాయి. అలాగే లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 2 సర్వీసులు, ఫలక్‌నుమా-రామచంద్రపురం, ఫలక్‌నుమా-హైదరాబాద్, రామచంద్రపురం-ఫలక్‌నుమా మార్గాల్లో ఒక్కొ సర్వీసును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.