సంక్రాంతి పండగవేళ ..ప్రయాణికులకు షాక్ ఇచ్చిన MMTS

సంక్రాంతి పండగవేళ హైదరాబాద్ నగరవాసులకు షాక్ ఇచ్చింది MMTS. ఈరోజు, రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. లింగంపల్లి-నాంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో ట్రాక్ మరమ్మతుల కారణంగా 19 సర్వీసులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ తరుణంలో ఈరోజు, రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు అయ్యాయి. పండగవేళ ఇలా రైళ్లు రద్దు చేయడం ఫై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ లో మెట్రో అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుండి MMTS ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. గతంలో లక్షల మంది MMTS సేవలు వినియోగించుకునే వారు. కానీ ఎప్పుడైతే మెట్రో అందుబాటులోకి వచ్చింది కనీసం వందల మంది కూడా MMTS సేవలు వినియోగించుకోవడం లేదు. దీంతో వారంలో రెండు , మూడు సార్లు పలు రైళ్ల సర్వీస్ లను రద్దు చేస్తూ వస్తుంది దక్షిణ మధ్య రైల్వే . ఇక ఇప్పుడు ట్రాక్ ట్రాక్ మరమ్మతుల కారణంగా ఏకంగా 19 సర్వీస్ లను రద్దు చేసింది.