మధ్యాహ్నం తెలంగాణ జాగృతి కమిటీలతో ఎమ్మెల్సీ కవిత భేటీ

MLC Kavitha meets with telangana jagruthi committee

హైదరాబాద్ః తెలంగాణ జాగృతి మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఈరోజు మధ్యాహ్నం ముషీరాబాద్ లో తెలంగాణ జాగృతి కీలక సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. రాష్ట్ర, జిల్లాల జాగృతి బాధ్యులు ఈ మీటింగ్ కు హాజరవుతున్నట్లు సమాచారం. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న జాగృతి.. కవితను సీబీఐ ప్రశ్నిస్తున్న సమయంలో యాక్టివ్ కావడం ఆసక్తికరంగా మారింది. ఈరోజు మీటింగ్ లో ఏం జరగనుంది..? ఏ విషయాలపై చర్చిస్తారు..? అన్నది ఆసక్తికరంగా మారింది.

కాగా, తెలంగాణ ఉద్యమం సమయంలో కీలకంగా పని చేసిన తెలంగాణ జాగృతి.. రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు సైలెంట్ అయిపోయింది. కేవలం బోనాలు, బతుకమ్మ ఉత్సవాలకే పరిమితమైంది. జాగృతికి ఎమ్మెల్సీ కవిత అధ్యక్షురాలిగా ఉన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/