మోడీ ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత

,

ప్రధాని మోడీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. బుధువారం నిజామాబాద్‌లో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాతో కలిసి కవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..ప్రజలకు ఉచితాలు వద్దని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మధ్య నిజామాబాద్‌ వచ్చిన కేంద్ర మంత్రి నిర్మల.. రేషన్‌ షాప్ కు వెళ్లి మోదీ ఫొటో పెట్టలేదని గొడవ పడడం ఫై కవిత మండిపడ్డారు.రేషన్‌ షాపుల వద్ద మోడీ ఫోటోలు పెట్టడం కాదు, పెట్రోల్ బంకుల వద్ద, యూరియా బస్తాల మీద మోడీ ఫోటోలు కచ్చితంగా పెడతాం అని కవిత పేర్కొన్నారు. మోడీ రూ. 10లక్షల కోట్లు తన మిత్రులకు పంచి పెట్టారని .. కానీ ప్రజలకు అమలు చేసే సంక్షేమ పథకాలు(పింఛన్‌, రేషన్‌, షాదీ ముబారక్) ఇవ్వొద్దంటున్నారని కవిత ధ్వజమెత్తారు.

పేదవాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని ప్రధాని మోడీ అంటున్నారు. పేదవాళ్లకు ఇంటికో పింఛన్‌ ఇస్తున్నాం. ఇంట్లో ఉన్న సభ్యులందరికీ రేషన్‌ ఇస్తున్నాం. మోడీ పేదలకు పింఛన్‌, రేషన్‌, ఉపకారవేతనాలు ఇవ్వొద్దన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో ఇస్తున్నట్లు పింఛన్లు ఇస్తున్నారా?. మాటలు చెప్పే నాయకులకు ప్రజల బాధలు అర్థం కావు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందుతోంది. తొలి విడతలో ఇంటికి ఒక పింఛన్ ఇస్తున్నాం అని కవిత అన్నారు.