ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూల్ అయినట్లేనా..?

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరిక.. కాంగ్రె్‌సలో కలకలానికి కారణమైంది. తనకు సమాచారం ఇవ్వకుండా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ని, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివా్‌సరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం పట్ల మనస్తాపం చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. తన పదవికి రాజీనామా చేసేందుకు ..అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధం కావడం తో..ఆయన్ను ఈరోజు ఢిల్లీ పెద్దల ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు కేసీ వేణుగోపాల్‌ను జీవన్‌రెడ్డి తో మాట్లాడి శాంతింపజేశారు.

కాంగ్రెస్ పార్టీనే తనకు ముఖ్యమని ఆ సమావేశంలో జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిస్థితుల బట్టి కొన్ని నిర్ణయాలు ఉంటాయని దీపాదాస్ తెలిపారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తామని జీవన్‌రెడ్డికి దీపాదాస్ మున్షీ హామీ ఇచ్చారు. అదేవిధంగా పీసీసీ అధ్యక్ష పదవి విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో జీవన్‌రెడ్డిని కించపరడం తమ ఉద్దేశం కాదని, ఎమ్మెల్యే సంజయ్ చేరిక తాను అగౌరవంగా భావించారని దీపాదాస్ మున్షీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలకు డోర్లు తెరిచే ఉన్నాయని, ఇకపైన కూడా కొన్ని చేరికలు ఉంటాయని, దీనిపై పార్టీ హైకమాండ్‌తో చర్చలు జరిగాయని ఈ సందర్బంగా దీపాదాస్ తెలిపారు. అదే సమయంలో పార్టీలో మొదటి నుంచీ ఉన్న లీడర్లు, కేడర్‌కు ప్రాధాన్యత తగ్గకుండా చూసుకుంటామని, ఆ బాధ్యత పార్టీ నాయకత్వంపై ఉన్నదన్నారు.