భూపతిరెడ్డికి హైకోర్టులో నిరాశే

Bhupathi Reddy
Bhupathi Reddy

హైదరాబాద్‌: శాసనమండలిలో అనర్హతకు గురైన భూపతిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగ్గిలింది. భూపతిరెడ్డిపై అనర్హత చట్టబద్ధంగానే ఉందని హైకోర్టు పేర్కొంది. స్పీకర్, మండలి ఛైర్మన్‌లకు సభ్యులపై అనర్హత విధించే అధికారాలు రాజ్యాంగం ప్రకారం ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లోని 8వ పేరాను సవాల్ చేస్తూ భూపతిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారంటూ పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేశారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/