సిఎం సంక్షేమ పథకాలు నచ్చి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నాం

Vamana-and-Rega
Vamana-and-Rega

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆర్షితులుకావడంతో పాటు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యె వనమా వేంకటేశ్వరరావు, ఎమ్మెల్యె రేగా కాంతారావే స్పష్టం చేశారు. అయితే తొలుత తామంతా సిఎం కెసిఆర్‌ను కలిసి టిఆర్‌ఎస్‌లో చేర్చుకొమని కోరామని.. దీనికి ఆయన అంగీకరించారని వెల్లడించారు. ఆ తర్వాత 12 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అందించి.. సీఎల్పీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వనమా వివరించారు. దీనికి స్పీకర్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కాగా రాజ్యాంగపరమైన ప్రక్రియ పూర్తిచేసుకొని టిఆర్‌ఎస్‌లో చేరడం ఇక లాంఛనప్రాయమేనని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/