ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారం : నిందితులను నాంపల్లికి తరలింపు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతున్నది. చంచల్‌గూడలో జైలులో ఉన్న ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు రెండో రోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడినుంచి నేరుగా నాంపల్లిలోని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు తరలించారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా నిందితుల వాయిస్‭ను రికార్డింగ్ చేయనున్నారు. ఆ తర్వాత FSLలో నిందితుల వాయిస్ పరిశీలన పరీక్షలు చేయనున్నారు.

ఎమ్మెల్యేల బేరసారాల్లో బయటపడిన ఆడియో, వీడియోల్లోని వాయిస్‭ను అధికారులు పోల్చి చూడనున్నారు. ఏసీబీ కోర్టు అనుమతితో ముగ్గురు నిందితులను గురువారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకున్న అధికారులు 42 ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలపై ఉదయం ఒక్కొక్కరిని వేర్వేరుగా, మధ్యాహ్నం కలిపి ప్రశ్నించారు. 17 ప్రశ్నలకు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు. వీటిపై శుక్రవారం విచారణలో స్పష్టత తీసుకునేందు కు ప్రయత్నిస్తున్నారు. కస్టడీ పూర్తయ్యాక నిం దితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.