కెసిఆర్‌ను కలిసిన సండ్రవెంకటవీరయ్య

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్‌ను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రగతిభవన్‌లో కలిశారు. ఈసందర్భంగా సండ్ర వెంకటవీరయ్యఖమ్మం జిల్లాల్లో 2 లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు నాగార్జునసాగర్ ఎడమకాల్వ నుంచి నీరు విడుదల చేయాలని సిఎం కెసిఆర్‌ను కోరారు. సండ్ర విజ్ఞప్తి మేరకు నీటి విడుదలకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాల్లోని మెట్ట, ఆరుతడి పంటలకు నీరందించాలని సండ్ర కోరారు.