విజయసాయిరెడ్డి తో రోజా భేటీ
పార్టీ మహిళా విభాగం బలోపేతంపై చర్చ

Amaravati: తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా సెల్వమణి ఎంపీ విజయసాయిరెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా విభాగం, పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సీఎం వైయస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు చేయుతనిస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/