ఎమ్మెల్యె రోజా గన్‌మెన్‌కి కరోనా పాజిటివ్‌

కరోనా బారినపడిన తన గన్‌మెన్ 18 రోజులుగా సెలవులో ఉన్నాడన రోజా

Roja
Roja

అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌ కూడా కరోనా బారినపడ్డారు. తిరుపతిలోని స్విమ్స్ ఆయన్ను తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐతే తన ఆరోగ్యంపై ఆందోళన చెందల్సిన అవసరం లేదని.. కరోనా బారినపడిన తన గన్‌మెన్ సెలవులో ఉన్నాడని రోజా తెలిపారు. 18 రోజులుగా విధులుగా రావడం లేదని చెప్పారు. రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ రావడం.. ఆమె ఇటీవల మాస్క్ లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో వైస్‌ఆర్‌సిపి కార్యకర్తలు ఆందోళన నెలకొంది. కాగా ఏపిలో ఇప్పటి వరకు 23,814 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 12,154 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 277 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 11,383 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/