ఏపిఐఐసి ఛైర్మన్‌గా రోజా

టిటిడి బోర్డు ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి
వైఎస్‌ఆర్‌సిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టారెడ్డి

jagan, roja
jagan, roja

అమరావతి: నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను ఏపిఐఐసి ఛైర్‌పర్సన్‌గా నియమించారు. దీనిపై నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. మంగళవారం నాడు ఆమెను, మంత్రి పదవులు దక్కని మరికొందరు ఎమ్మెల్యేలను సియం జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే రోజాకు ఏపిఐఐసి చైర్‌పర్సన్‌ పదవిని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌ మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి పేరు ఖరారు చేశారు. మరోవైపు వైఎస్‌ఆర్‌సిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టారెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించనున్నారు. కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అనంతపురం జిల్లాకు చెందిన ఒక నేత పేరును పరిశీలిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ది మండళ్ల ఏర్పాటుకు వైఎస్‌ఆర్‌సిపి నిర్ణయించింది. మొత్తం 5 ప్రాంతీయ అభివృద్ది మండళ్లను ఏర్పాటు చేయనున్నారు.

  1. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు
  2. ఉభయగోదావరి జిల్లాలు
  3. కృష్ణా ,గుంటూరు
  4. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు
  5. కర్నూలు, అనంతపురం జిల్లాలు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/