జైలు నుండి విడుదలైన ఎమ్మెల్యే రాజాసింగ్

ఎమ్మెల్యే రాజసింగ్పై హైకోర్టు పీడీయాక్టును ఎత్తేయటంతో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ జైలు నుండి విడుదలయ్యారు. వివాదాస్ప వ్యాఖ్యల కేసులో అరెస్టైన రాజా సింగ్ కు బుధవారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై ప్రయోగించిన పీడీయాక్టును కూడా హైకోర్టు ఎత్తివేసింది. ఈ క్రమంలో బుధువారం రాత్రి చర్లపల్లి జైలు నుండి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హైకోర్టు షరతులు విధించడంతో ఎలాంటి ర్యాలీ లేకుండానే రాజా సింగ్ ఇంటికి చేరుకున్నారు.

ఎమ్మెల్యే రాజసింగ్పై హైకోర్టు పీడీయాక్టును ఎత్తేయటంతో బీజేపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు.పెద్దఎత్తున బీజేపీ కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు…టపాసులు కాల్చారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. పీడీయాక్టును ఎత్తివేయడంతో పాటు..బెయిల్ మంజూరు కావడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ధర్మం విజయం సాధించిందని ట్విట్టర్ లో తెలిపారు. మరోసారి మీ సేవకు పాత్రున్ని కాబోతున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా శ్రీరాముడు విగ్రహంతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.