ఆ పాటను కాపీ కొట్టారు: పాకిస్థాన్‌

BJP MLA Raja Singh , Pakistan Army song
BJP MLA Raja Singh , Pakistan Army song

హైదరాబాద్‌: బిజెపి, గోషామహల్‌ ఎమ్మెల్యె రాజా సింగ్‌ శ్రీరామనవమి సందర్భంగా హిందుస్థాన్‌ జిందాబాద్‌ అని స్వయంగా ఓ పాట పాడారు. అయితే రాజాసింగ్‌ పాడిన పాట వివాదానికి దారి తీసింది. కాగా పాకిస్థాన్‌ మా పాటను కాపీ కొట్టారని ఆరోపిస్తున్నది. మార్చి 23న పాకిస్థాన్‌ డే తాము రూపొందించిన ఖపాకిస్తాన్‌ జిందాబాద్‌గపాటకు ఇది కాపీ అంటూ పాకిస్థాన్ ఆర్మీ అధికారి మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అసిఫ్ గ‌ఫూర్ ట్వీట్ చేశారు. ఈ పాటను పాక్‌కు చెందిన సహిర్‌ అలీ బగ్గా రాసారని తెలియజేశారు. పాట‌ను కాపీ చేయ‌డం సంతోష‌మే అని, కానీ నిజ‌మైన పాట పాడితే బాగుంటుందని ఆ అధికారి ఓ ట్వీట్‌లో చెప్పారు. పాకిస్థాన్ జిందాబాద్ స్థానంలో హిందుస్థాన్ జిందాబాద్ అని పాడుతున్నార‌ని పాక్ అధికారి ఆరోపించారు. దిల్ కా హిమ్మ‌త్ వ‌త‌న్‌.. అప్నా జ‌జ్‌బా వ‌త‌న్‌. మ‌న్ కీ స‌చ్చీ ల‌గ‌న్‌… సీదా ర‌స్తా వ‌త‌న్ అన్న పాట‌ను రాజా సింగ్ పాడారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/