ప్రభుత్వంపై జగ్గారెడ్డి విమర్శలు

కరోనాకేమో 100 కోట్లు… సచివాలయానికేమో 500 కోట్లా..?

Jagga reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కరోనాతో జనం చస్తుంటే.. చర్చించాల్సింది ఇదేనా..?, సెక్రటేరియట్‌కి 500 కోట్లు అవసరమా..? కరోనాకేమో 100 కోట్లు… సచివాలయానికేమో 500 కోట్లా..? మానవత్వం లేని ప్రభుత్వం ఇది. సెక్రటేరియట్ మీద చూపించిన శ్రద్ధ.. ఆస్పత్రుల మీద దృష్టి సారిస్తే మంచిది. మంత్రి తలసానికి కరోనా వస్తే గాంధీలో చేరుతా అంటున్నారు. తలసాని.. మంత్రి కాబట్టి గాంధీ ఆస్పత్రిలో చుట్టూ 50 మంది వైద్యులు ఉంటారు. సామాన్యుడికి కూడా అలాంటి వైద్యమే చేస్తారా..?, మంత్రులు భజన మండలి మానుకోండి. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి. త్వరలోనే దీనికోసం దీక్ష చేస్తా.. దీక్ష చేసి వదిలేయను.గ అంటూ జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/