కెసిఆర్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు

Balka Suman
Balka Suman

హైదరాబాద్ : టిఆర్ఎస్ చీఫ్, సిఎం కెసిఆర్ తోనే తెలంగాణ వచ్చిందని చెన్నూరు ఎంఎల్ఎ బాల్క సుమన్ స్పష్టం చేశారు. కెసిఆర్ లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదని ఆయన తెలిపారు. కెసిఆర్ లేకుంటే , తామెవ్వరం లేమని ఆయన చెప్పారు. బంగారు తెలంగాణ స్థాపన దిశగా కెసిఆర్ సాగుతున్నారని ఆయన కొనియాడారు. తెలంగాణ వచ్చిన తరువాత అన్ని వర్గాల సంక్షేమం కోసం కెసిార్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అంతరించిపోతున్న కులవృత్తులను కెసిఆర్ పునరుద్ధరించారని ఆయన ప్రశంసించారు. కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు పని చేయాలని ఆయన కోరారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/