ఎమ్మెల్యే బాలకృష్ణకు చెదు అనుభవం

nandamuri-balakrishna
nandamuri-balakrishna

లేపాక్షి: హిందూపురానికి చెందిన టిడిపి పార్టీ అధికార ప్రతినిధి రమేష్‌ కుమార్తె వివాహనికి హజరయ్యోందుకు బాలకృష్ణ హైదరాబాద్‌ నుండి బెంగుళూర్‌కు విమానంలో వెళ్లారు. అక్కడినుండి రోడ్డు మర్గాన హిందూపురానికి బయలుదేరాడు ఈ విషయం తెలుసుకున్న గలిబిపల్లి గ్రామస్థులు లేపాక్షి-హిందూపురం ప్రధాన రహదారిపై బైఠాయించారు. లేపాక్షి-హిందూపురం మెయిన్‌రోడ్డు నుండి గలిబిపల్లి రోడ్డు వేస్తామని సంవత్సరం క్రింద బాలకృష్ణ శంకుస్థాపన చేశాడు. అది ఇప్పటి వరకు పూర్తికాలేదు దీనితో రోడ్డు బాగలేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న గలిబిపల్లి గ్రామస్థులు ఎమ్మేల్యేను నిలదీశారు. దీనితో బాలకృష్ణ రోడ్డు సంబంధిత అధికారులతో మట్లాడి రోడ్డు పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. కాగా శాంతించిన గ్రామ ప్రజలు వెనుతిరిగారు. బెంగుళూర్‌ నుంచి రోడ్డు మర్గాన వస్తున్న బాలకృష్ణకు అభిమానులు, టిడిపి కార్యకర్తలు పెద్దఎత్తున కొడికొండ చెక్‌పోస్టు వద్దకు చేరుకొని ఘనస్వాగతం పలికారు.
తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/