వైఎస్సార్‌సీపీ నేత పంచకర్ల రమేష్‌‌బాబు ఫై పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ సెటైర్లు

,

వైస్సార్సీపీ పార్టీ నేతల మధ్య విభేదాలు అనేది మొదటి నుండి నడుస్తూనే ఉన్నాయి. ఒకే ప్రాంతంలో ఇద్దరు , ముగ్గురు నేతలు ఉన్నప్పటికీ వారి మధ్య వార్ మాత్రం నడుస్తూనే ఉంటుంది. తాజాగా పెందుర్తి వైస్సార్సీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్..వైఎస్సార్‌సీపీనేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌‌బాబు ఫై సెటైర్లు వేశారు.అసలు పంచకర్ల రమేష్ అనే వ్యక్తి వైఎస్సార్‌సీపీ నాయకుడని తామైతే పరిగణించట్లేదని , ఆయన అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉందని అదీప్‌రాజ్ అన్నారు. అంతే కాదు పంచకర్ల నియోజవర్గ పర్యటనపై ఎమ్మెల్యే అదీప్ రాజ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.తాము జగన్ సైనికులమని.. ఆయన జనసైనికుడు అన్నారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు చర్చ గా మారాయి.

2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పంచకర్ల రమేష్ బాబు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ప్రజారాజ్యం నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలినంకావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. 2014 ఎన్నికలకు ముందు పంచకర్ల రమేష్ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో ఎలమంచిలి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓడిపోయారు. అనంతరం ఎన్నికల్లో రూరల్‌లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఆ తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పి జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ప్రస్తుతం వైస్సార్సీపీ లోనే కొనసాగుతున్నారు. అయినప్పటికీ అదీప్‌రాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.