మిక్స్‌డ్‌ జ్యూస్‌

juice
juice

మిక్స్‌డ్‌ జ్యూస్‌

ఏ శారీరక బాధలున్నా డైరెక్టుగా జ్యూసులకన్నా అన్నీ కలిపిన మిక్స్‌డ్‌ జ్యూసుల ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ జ్యూస్‌లు ఎన్నో రకాలుగా ఆరోగ్య పరిరక్షణ కు ఉపయోగపడతాయి. భోజనం సహించనివారు, తినటానికి వ్యవధి లేనివారు, శరీరానికి పోషకాలు అందించాలనుకునేవారు తరచుగా జ్యూసులు తాగటం మంచిదంటున్నారు. ఎవరెవరు, ఎలాంటి ప్రాబ్లమ్స్‌ ఉన్నవారు, ఏయే జ్యూసులు తాగాలో తెలుసుకుందాం. ్య శరీరం ఎప్పుడూ అలసినట్లుంటుందా? మీకు నీరసంగా అనిపిస్తుందా? ఇలాంటి వారు ఏవయస్సు వారైనా యాపిల్‌, ఆరెంజ్‌, క్యారెట్‌, బీట్‌రూట్‌ల మిశ్రమజ్యూసులు తాగాలి.

అవసరమైతే ఓ రెండు చెంచాల తేనె ఏ జ్యూసులో అయినా కలుపుకుని తాగవచ్చును. ్య వర్క్‌స్ట్రెస్‌తో బాగా ఆందోళనగా ఉందా? రిలాక్సేషన్‌ కొరకు యాపిల్‌, పైనాపిల్‌ ముక్కలు కాస్త పుదీనా కలిపి జ్యూస్‌ తీసి నిమ్మరసం తగినంత మాత్రం కలుపుకుని తాగండి. వెంటనే మూడ్‌ మారిపోతుంది. మీలో రోగనిరోధకశక్తి పెంపొందించుకోవటానికి యాపిల్‌, క్యారెట్‌, లెమన్‌, జింజర్‌, గార్లిక్‌ వీటిని మిక్సీచేసి జ్యూస్‌లా చేసుకుని తాగాలి.

(నిమ్మకాయ-ఒక చెక్క, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెండు రెబ్బలు) మీ చర్మసౌందర్యం కోసం పలురకాల మలిన వ్యర్థపదార్థాలను తొలగించి, శరీరాన్ని శుభ్రంగా ఉంచే మిక్స్‌డ్‌ జ్యూసులు తాగాలి. యాపిల్‌, ద్రాక్ష, పుచ్చకాయ, ఓ చిన్న అల్లంముక్క (అన్నీ సమాన ముక్కలుగా తీసుకోండి). మన శరీరంలో 500 విభిన్న విధుల్ని నిర్వహించే అతి పెద్ద రసాయనశాల మన లివర్‌. లివర్‌ ఎంత బలంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ఇందుకోసం పైనాపిల్‌ క్యారెట్‌, బీట్‌రూట్‌, లైమ్‌, కలిపి మిక్స్‌డ్‌ జ్యూసుగా మీరు తాగవచ్చు.