ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్

ఇటీవలే పుంగనూరులోని వైసీపీ కౌన్సిలర్లు షాకిచ్చారు. మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషతో సహా మిగతా కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వేరే కాకుండా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో క్షేత్రస్థాయిలోని పరిస్థితిని చక్కదిద్దాలని భావించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి… ఇవాళ కార్యకర్తలతో ఓ సమావేశాన్ని నిర్ణయించారు. అయితే ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు సిద్దమవుతున్నారన్న సమాచారంతో నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

తాజా పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఇంటిని చుట్టిముట్టారు. ఈ పర్యటనకు వెళ్తే పుంగనూరులో గొడవలు జరిగే అవకాశం ఉందనే ముందస్తు సమాచారంతో మిధున్‌ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
మిథున్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్ అయిన నేపధ్యంలో వందలాది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పుంగనూరు, రాజంపేట పరిధిలో టీడీపీ భౌతిక దాడులకు పాల్పడుతోందని వైసీపీ MP మిథున్ రెడ్డి ఆరోపించారు. బాధితులను పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని, TDP దారుణాలు బయటపడతాయని తనను హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. YCPలో ఉన్న ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని పేర్కొన్నారు.