రెండో వన్డేలో మిథాలి సేన గెలుపు

India women's national cricket team
India women’s national cricket team

నార్త్‌ సౌండ్‌: వెస్టిండీస్‌తో తలపడుతున్న మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్‌ను మిథాలీ సేన కైవసం చేసుకుంది. టీమిండియా మహిళా జట్టు 53 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లకుగాను ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా, విండీస్‌ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 138 పరుగులు మాత్రమే చేసింది. కాగా తొలి వన్డేలో విడీస్‌ గెలుపొందగా సిరీస్‌ 1-1తో చెరో మ్యాచ్‌ను గెలిచాయి. ఓపెనర్లు ప్రియా పునియా 5 చేయగా, జమిమా రోడ్రిగ్స్‌0 పరుగులతో నిరాశపరిచారు. మిథాలి రాజ్‌ 40, పూనమ్‌ రౌత్‌ 77, హర్మన్‌ప్రీత్‌ 46 పరుగులతో జట్టును ఆదుకున్నారు. కాగా భారత బౌలర్లు రాజేశ్వరి, పూనమ్‌, దీప్తిశర్మ ఒక్కొక్కరు రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. ఇరు జట్లకు ఫైనల్‌ మ్యాచ్‌ ఈ నెల 6న జరగనుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/