గంగూలీ, కాజల్‌కు చాలెంజ్‌ విసిరిన మిథాలి

Mithali Raj
Mithali Raj

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీన్‌ చాలెంజ్‌ కార్యక్రమంలో భారత మహిళా క్రికెట్‌ జట్టు క్రీడాకారిణి మిథాలీరాజ్‌ తిరుమలగిరిలోని తన నివాసంలో ఓ మొక్కను నాటారు. ఈ చాలెంజ్‌లో భాగంగా మీరు కూడా ఒక్కొక్క మొక్కను నాటి, మరో ముగ్గురికి చాలెంజ్‌ ఇవ్వాలని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌, ప్రముఖ క్రీడా పాత్రికేయుడు బోరియా మజుందార్‌, పారిశ్రామిక వేత్త వాణికోలాకు ఆమె చాలెంజ్‌ విసిరారు. కాగా తన చాలెంజ్‌ను స్వీకరించిన సినీ నటి కాజల్‌ అగర్వాల్‌ త్వరలోనే మొక్కలు నాటూతానని తనకు ట్వీట్‌ చేశారంటూ ఈ సందర్భంగా మిథాలి రాజ్‌ తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/