అతిగా కూల్‌డ్రింక్స్‌తో అనర్ధాలు!

ఆరోగ్య సూచనలు

cool drinks
cool drinks

కూల్‌ డింక్స్‌ తాగనివారు అరుదుగా ఉంటారు. సరదగా బయటకు వెళ్లినా ఇంట్లోకి బంధువులు వచ్చినా.. చాలామంది కూల్‌ డ్రింగ్స్‌ తప్పనిసరిగా తాగుతుంటారు.

తియ్యతియ్యగా.. చల్లచల్లగా.. ఉండే ఈ శీతల పానీయాలు ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి వల్ల కలిగే అనర్ధాలేంటో తెలుసా?

కూల్‌డ్రింక్సలో స్వీట్‌ సోడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రుచి కోసమే ఎక్కువ మంది శీతల పానీయాలు తాగుతుంటారు.

వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా.. ఆరోగ్యానికి హాని చేస్తాయి. మీరు తాగే కూల్‌ డ్రింక్స్‌లో అత్యధిక స్థాయిలో చక్కెర ఉంటుంది. ఇది శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఓ అధ్యయనం ప్రకారం కూల్‌ డ్రింక్స్‌ తాగిన వారిలో ఒబెసిటీ (ఊబకాయం) సమస్యలు పెరుగుతాయి.
కూల్‌ డ్రింక్స్‌ ఎప్పుడో ఒకసారి తాగితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ తరచూ తాగితే గుండె సంబంధ వ్యాధులు కూడా వస్తాయి.

శీతల పానీయాలతో ఎసిడిటీతో పాటు జీర్ణ సంబంధ సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది.
గ్యాస్ట్రిక్‌ సమస్యలతో ఇబ్బంది పడతారు.

కూల్‌ డ్రింక్స్‌ ఎక్కువ తాగే వారిపై సర్వే చేయగా.. వారిలో ఎక్కువ మంది అనారోగ్య సమస్యలకు గురయినట్లు అధ్యయనంలో తేలింది.

అందుకే కూల్‌ డ్రింక్స్‌కు దూరంగా ఉండడం మంచింది.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/