మేలుచేసే మిరప

MIRCHI--
MIRCHI–

మేలుచేసే మిరప

మిరపకాయ అనగానే నోట్లో ఏదో తెలీని ఘాటు అన్పిస్తుం ది. కాని ఆమిర్చి మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొందరికి మిర్చీ ఘాటు లేనిదే ముద్ద కూడా దిగని వారున్నారంటే నమ్మసక్యం కాదు చాలామందికి కాని ఇది నిజం. పూర్వం సద్దన్నంతో చాలా మంది పొలాలకు కొన్ని మిరపకాయలను నంజుకోడానికి పట్టికెళ్లేవారు. ఇలాచాలామందికి సమోసాతో ఏదైనా స్నేక్స్‌తో ఏదోఒకదానిలో దీనిని తినడం అంటే చాలా ఇష్టం. ఘాటుకోసం రుచికోసం తినే మిర్చిలోని క్యాప్సైసిన్‌, మున్ముందు ఎన్నో అద్భుతాలు చేయనుంది.

అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ వ్యోమింగ్‌ స్కూల్‌ ఆఫ్‌ పార్మసీకి చెందిన నిపుణులు. క్యాప్సైసిన్‌కి నాడీకణాలమీద ప్రభావం చూపించడం ద్వారా నొప్పిని తగ్గించే గుణం ఉందన్నది తెలిసిందే. ఆ కారణంతోనే ఈ పదార్థంతో రుమటాయిడ్‌ ఆర్ధ్ర యిటిస్‌తోబాటు ఇతరత్రా నాడీసంబంధ వ్యాదులకు మందును కనగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే క్యాఫ్సైసిన్‌తో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయనీ ముఖ్యంగా రొమ్ముక్యాన్సర్‌ కణాల పెరుగుదలని అడ్డు కుంటుందనీ ఊబకాయాన్ని నియంత్రిస్తుందనీ తాజాగా గుర్తించారు. అందులో భాగంగా వీళ్లు రూపొందిం చిన మెటాబొసిన్‌ అనే మందు కొంచెకొంచెంగా క్యాప్సైస్టిన్‌ను విడుదల చేస్తూ రక్తంలో చక్కెర స్థాయుల్నీ కొలెస్ట్రాల్‌ నిల్వల్నీ తగ్గించినట్లు తేలింది. కాబట్టి ఈ మందుతో ఊబకాయాన్ని సమర్ధంగా ఎదుర్కోవచ్చు నని చెప్తున్నారు అధ్యయన కర్తలు.