కవితకు మైనార్టీల మద్దతు

k kavita
k kavita


జగిత్యాల: నిజామాబాద్‌ టిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్ధి కల్వకుంట్ల కవితకు జగిత్యాలలో మైనార్టీలు మద్దతు తెలిపారు. ఈ రోజు జగిత్యాలలో కవితకు మద్దతుగా మైనార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కవిత మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధి కోసం సియం కేసిఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. నిజామాబాద్‌ ఎన్నికల బరిలో ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ అభ్యర్ధి తోకముడిచాడు. ఓడిపోతాననే భయంతోనే ఎన్నికల కన్నా ముందు బిజెపి అభ్యర్ధికి మద్దతిస్తున్నాడని కవిత ఆరోపించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/