మైనర్‌ బాలికపై అత్యాచార యత్నం

దేహశుద్ధి చేసిన గ్రామస్థులు

Rape attempt
Rape attempt

చిత్తూరు: ఒకవైపు పశు వైద్యురాలు దిశ హత్యోదంతంతో దేశం మొత్తం అట్టుడికిపోతుంది. నిందితులను ఉరితీయాలంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు తెలుగు ప్రజలు. ఈ సమయంలో ఏ చిన్న తప్పు జరిగినా ప్రజలు క్షమించే పరిస్థితులు కనిపించడంలేదు. అయితే ఈ సమయంలోనే ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం చేయబోయాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని వాల్మీకిపురం గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన గంగాధరం అనే వ్యక్తి ఓ బాలికపై అత్యాచారం చేసే సమయంలో బాలిక భయానికి గురై కేకలు వేసింది. అది గమనించిన స్థానికులు గంగాధరానికి దేహశుద్ధి చేశారు. అతడ్ని చితక బాదిన అనంతరం పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/