మేడారంలో పర్యటించిన మంత్రులు

Ministers
Ministers

మేడాంం: మేడారం సమ్మక్క,సారలమ్మ జాతరకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు , గిరిజన, మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి భారీగా తరలిస్తారని అన్నారు. తెలంగాణ కుంభమేళాగా జరిగే ఈజాతరను ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని అన్నారు. శుక్రవారం ఇక్కడ జరుగుతున్న అభివృద్ది పనులను మంత్రులు పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జంపన్నవాగులో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌ను ప్రారంభించారు. అక్కడ ఉన్న స్నానఘట్టాలను మంత్రులు పరిశీలించారు. కేవలం తెలంగాణ నుంచేకాకుండా పక్క రాష్ర్టాల నుంచి కూడా భారీగా తరలి వచ్చే భక్తుకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మన పై ఉందన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/