సీఏఏను వ్యతిరేకిస్తున్న మంత్రులను బర్తరఫ్‌ చేయాలి

సీఏఏపై ఎంఐఎం, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయి

kanna lakshmi narayana
kanna lakshmi narayana

విజయవాడ: సీఏఏను వ్యతిరేకిస్తున్న మంత్రులను బర్తరఫ్‌ చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ డిమాండ్‌ చేశారు. విజయవాడలో కన్నా మీడియాతో మాట్లాడుతూ..గుంటూరులో పౌరసత్వ సవరణ (సీఏఏ) చట్టంకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యటు తీసుకోలేదని కన్నా ప్రశ్నించారు. సీఏఏపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయి చర్చ జరిగిన తర్వాతే చట్టం చేశారని ఆయన గర్తు చేశారు. ఓ వర్గానికి నష్టం జరుగుతుందంటూ ఎంఐఎం, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని..తద్వారా లబ్ది పొందేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై అల్లర్లు రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కన్నా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎంఐఎం అధినేత సమావేశం ఏర్పాటు చేస్తే దానికి వైఎస్‌ఆర్‌సిపి నేత ఆర్థిక సాయం చేశారని కన్నా లక్ష్మీనారయణ ఆరోపించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/