మంత్రి విశ్వరూప్‌కు హార్ట్ సర్జరీ సక్సెస్

ముంబై లీలావతి హాస్పటల్ లో మంత్రి విశ్వరూప్‌కు చేసిన హార్ట్ సర్జరీ సక్సెస్ అయ్యింది. ఈ నెల 2న వైఎస్సార్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకున్న సంద‌ర్భంగా అనారోగ్యానికి గురైన విశ్వ‌రూప్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ప్రాథమిక చికిత్స అనంత‌రం హైద‌రాబాద్‌లో వైద్యం చేయించుకున్నారు. మ‌రోమారు ఆయన అనారోగ్యానికి గురికావడంతో.. మెరుగైన వైద్య చికిత్స‌ కోసం ఆయ‌న‌ను ముంబై లీలావతి హాస్పటల్ కు తరలించగా..విశ్వ‌రూప్‌కు సోమ‌వారం ముంబైలోని లీలావ‌తి ఆసుప‌త్రిలో హార్ట్ ఆప‌రేష‌న్ చేసారు.

ఆయనకు గుండెలో ఆరు చోట్ల వాల్వులు బ్లాక్‌ కావడంతో డాక్టర్లు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేశారు. ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ శస్త్రచికిత్స జరిగిందని మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణారెడ్డి చెప్పారు. మరోవైపు మంత్రి విశ్వరూప్‌ను సర్జరీకి ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. మంత్రికి సీఎం జగన్‌ ధైర్యం చెప్పారు. మంత్రి సతీమణి బేబీమీనాక్షి, కుమారుడు కృష్ణారెడ్డిలతో కూడా సీఎం మాట్లాడారు. తాను అన్నివేళలా అందుబాటులో ఉంటానని, విశ్వరూప్‌ ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడుతుందని అన్నారు.