స్వామీజీలు, నేతలు మాట్లాడవద్దని విజ్ఞప్తి

మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దని హితవు

Vellampalli Srinivas
Vellampalli Srinivas

అమరావతి: అంతర్వేది రథం అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిందని వెల్లడించారు. ఇక అంతర్వేది రథం దగ్ధం ఘటనపై స్వామీజీలు, నాయకులు మాట్లాడవద్దని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేవారు. కొందరు చర్చిలు, ఇతర ప్రార్థనామందిరాలపై రాళ్లు వేస్తున్నారని తెలిపారు. ఆలయాల్లో రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో బిజెపి మతపరమైన అంశాలను లేవనెత్తుతోందని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు.

2017 రథం దగ్ధం ఘటనపై సోము వీర్రాజు బాధ్యత తీసుకుంటారా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఫాంహౌస్ లో కూర్చుని నల్లబ్యాడ్జీలు పెట్టుకుంటే సరిపోదని విమర్శించారు. అంతర్వేది ఘటనపై మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ రథం అనూహ్యరీతిలో అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్లు వచ్చాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/