మహిళా శిశు సంక్షేమంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉండాలి

మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్‌ పెద్దపీట వేస్తున్నారు

taneti vanitha
taneti vanitha

విశాఖపట్టణం: మహిళా, శిశు సంక్షేమంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం ఆమె విశాఖపట్నంలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో చిన్నారులకి పౌష్టికాహార లోపం లేకుండా మెరుగైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు మరింత జవాబుదారీగా పనిచేయాలని సూచించారు. ఏపీలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. పౌష్టికాహారం ద్వారా రక్తహీనత, మతా శిశు మరణాలు తగ్గాయని మంత్రి తానేటి వనిత చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/