తెలంగాణలో మెరుగైన వైద్యం అందుతోంది

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వాతావరణంలో మార్పుల కారణంగానే వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. వ్యాధుల బారిన పడినవారికి మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వం, వైద్యులు కృషి చేస్తున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు. అన్ని చోట్ల మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు పబ్లిసిటీ కోసం తప్పుడు వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. మీడియా కూడా వాస్తవాలను చూపించాలని కోరారు. రోగులు ఎక్కువ సంఖ్యలో రావడంతో… తప్పని పరిస్థితుల్లోనే నేల మీద పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారని చెప్పారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/