రూ.30కోట్లతో సికింద్రాబాద్‌ బస్‌టెర్మినల్స్‌ అభివృద్ధి

minister-talasani-srinivas-yadav

హైదరాబాద్‌: పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గురువారం సికింద్రాబాద్‌లోని బస్టాప్‌, ఫుట్‌పాత్‌లు ఇతర పలు అభివృద్ధిపనులు జరుగుతున్నతీరును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఉన్నబస్‌టెర్మినల్స్‌ను రూ.30కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఇక్కడి బస్‌స్టాప్‌లను అందంగా తీర్చిదిద్దాలని ఇక్కడ ధీమ్‌పార్కులను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి కెటిఆర్‌ సంకల్పించారని తెలిపారు. ఇక్కడికి రోజుకు కొన్నిలక్షల మంది ప్రయాణీకులు వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్‌టెర్మినల్స్‌ అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఈక్రమంలోనే అధికారులకు పలు సూచనలు చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/