అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు

హైదరాబాద్ : గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా బోనాల ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించినందున ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. గోల్కొండ జగదాంబ అమ్మవారు కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలను చల్లగా చూడాలని కోరుతున్నానని అన్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సంస్కృతి ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలలో కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణకు 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్ధం హెల్త్ శిభిరాలు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేరాల నియంత్రణ, ఈవ్ టీజింగ్ ను అరికట్టేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో పారిశుధ్య నిర్వహణ కు ప్రత్యేక సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వివిధ ఆలయాలకు 15 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని మంత్రి తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/