ఆగస్టు 5 నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ

10కోట్ల రూపాయల వ్యయంతో 5కోట్ల రొయ్య పిల్లలను విడుదల

minister-talasani-srinivas-yadav

హైదరాబాద్‌: పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సోమవారం పశసంవర్ధక, మత్స్య,పాడి పరిశ్రమ శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం ఆగస్టు 5 నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 24వేల చెరువులు, రిజర్వాయర్లలో 50కోట్ల రూపాయల వ్యయంతో 81లక్షల చేప పిల్లలు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని 78 నీటి వనరులలో 10కోట్ల రూపాయల వ్యయంతో 5కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తామన్నారు. కరోనానేపధ్యంలో చేప పిల్లల విడుదల సమయంలో తగుజాగ్రత్తలు తీసుకోనున్నట్టు చెప్పారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో మత్స్యకారుల కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.


త్వరలోనే 2వ విడత గొర్రెలు, పాడి గేదెలకు సంబంధించిన పెండింగ్‌ ఇన్సూరెన్స్‌ను నెల రోజుల్లో చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కృత్రిమ గర్భదారణ కార్యక్రమంలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. ఆగస్టు 1 నుంచి మే 2021 వరకు కృత్రిమ గర్భదారణ కార్రకమంలో కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు. త్వరలోనే మెగా డెయిరీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజయ డెయిరీ లాభాల బాటలో పయనిస్తోందని పేర్కొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/