పర్యాటక ప్రాంతాల్లో షూటింగులపై ప్రణాళిక

ప్రణాళిక వచ్చాక సిఎంను కలుస్తామన్న శ్రీనివాస్ గౌడ్

V. Srinivas Goud
V. Srinivas Goud

హైదరాబాద్‌: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిలిం చాంబర్ లో టాలీవుడ్ సినీ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… సినిమా షూటింగులతో పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిత్రీకరణల కోసం నిర్మాతలు ముందుకొచ్చారని వెల్లడించారు. టూరిజం ప్రదేశాల్లో సినిమా షూటింగులపై వారంలోగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ప్రణాళిక రూపొందించాక సిఎం కెసిఆర్ ను కలుస్తామని, వివరించారు. లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘకాలం పాటు సినిమా, టీవీ షూటింగ్ లు నిలిచిపోగా, నిన్న కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. షూటింగులు జరుపుకునేందుకు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/