ఈవ్ టీజింగ్ కి పాల్ప‌డితే కోసి కారం పెడ‌తా: మంత్రి వార్నింగ్

నా లాంటి అన్న పక్కన ఉంటే కోసి కారం పెడతాడు: ఈవ్ టీజర్లకు మంత్రి సీదిరి అప్పలరాజు వార్నింగ్

అమరావతి: శ్రీకాకుళంలో దిశ యాప్ డౌన్ లోడింగ్ మెగా డ్రైవ్ లో మంత్రి సీదిరి అప్పల రాజు మాట్లడుతూ.. మహిళలను వేధిస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఎవడైనా ఈవ్ టీజర్.. మహిళలను వేధించేటప్పుడు తన లాంటి అన్న పక్కన ఉంటే కోసి కారం పెడతాడని హెచ్చరించారు.

‘‘ఏదైనా సందర్భంలో ఎవరైనా మహిళలు బస్టాండ్ లో బస్సు కోసం వేచి చూస్తుండవచ్చు. ఆ సమయంలో ఎవరైనా ఈవ్ టీజర్ వేధింపులకు పాల్పడవచ్చు. ఫిర్యాదు చేసేందుకు దగ్గర్లో పోలీసులు ఉండకపోవచ్చు. మహిళ చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా ఉండి ఉండకపోవచ్చు. మరి, అలాంటి సందర్భంలో నా లాంటి అన్న ఉంటే.. నా ఫోన్ లో దిశ యాపే ఉంటే ఆ ఈవ్ టీజర్ కు కోసి కారం పెడతాడు’’ అని వ్యాఖ్యానించారు. కాగా, యాప్ డౌన్ లోడింగ్ కార్యక్రమంలో మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/