గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి సీరియస్

గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి సీరియస్ అయ్యారు. తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర్ రాజన్ మూడేళ్లు పూర్తయిన సందర్భాంగా రాజభవన్ లో తమిళిసై మీడియా సమావేశం ఏర్పటు చేసి తెలంగాణ ప్రభుత్వం ఫై , కేసీఆర్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తనకి ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదని, తనకి గౌరవం ఇవ్వకపోతే.. తానేమీ తక్కువ కాదని ..గవర్నర్ గా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నా పని నేను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. మేడారం జాతరకు వెళ్తానంటే హెలికాప్టర్ ఏర్పాటు చేయలేదని, ప్రజల సమస్యల పరిష్కరించాలని గవర్నర్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే కనీస స్పందన లేదన్నారు. సదరన్ కౌన్సిల్ భేటీలో విభజన సమస్యలు ప్రస్తావించే వీలున్నా ఎందుకు పట్టించుకోలేదు. అసలు ఆ సమావేశానికి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు. నిద్రపోయేవాళ్లని లేపొచ్చు. నిద్రపోతున్నట్లు నటించేవాళ్లని లేపలేం. గవర్నర్‌గా నా పరిధి మేరకు పనిచేస్తున్నా. ఏనాడూ నా పరిధి దాటి ప్రవర్తించలేదు. గవర్నర్ కార్యాలయంపై తీవ్ర వివక్ష చూపుతున్నారని ఆమె అన్నారు.

గవర్నర్ వ్యాఖ్యల ఫై టిఆర్ఎస్ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గవర్నర్ బీజేపీ నాయకురాలిగా మాట్లాడుతోందని.. గవర్నర్ తన పని తాను చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ ఎప్పుడు రావాలన్నది ఆయన ఇష్టమని, గవర్నర్ తన పరిధి దాటి బీజేపీ ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వరదలు వస్తే ప్రభుత్వం ఉండగా మీకేం పని అని పరామర్శలు, పర్యటనలకు వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణ చరిత్ర గవర్నర్ కు తెలియదని, అందుకే విమోచనం అంటున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళల పట్ల చాలా గౌరవం ఉందని మంత్రి సత్యవతి అన్నారు.