హరితహారంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి

రాష్ట్రంలో 33 శాతానికి అడవులు: మంత్రి సబిత

Sabitha Indra Reddy
Sabitha Indra Reddy

వికారాబాద్‌: తాండూరు నియోజకవర్గం పెద్దేముల్‌ మండలం దుగ్గపూర్‌లోని అటవీ భూమిలో 33,200 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డితో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ..‘జంగల్‌ బచావో-జంగల్‌ బడావో’  కార్యక్రమంతో రాష్ట్రంలో అడవులను 33 శాతానికి పెంచడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని తెలిపారు. రేపటి నుంచి ప్రారంభంకానున్న హరితహారంలో ప్రజలంతా భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నాటిన ప్రతిమొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనపైనే ఉందని చెప్పారు. హరిత తెలంగాణ కోసం సిఎం కెసిఆర్‌ కృషిచేస్తున్నారని తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/