ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన సబితా

Sabitha Indra Reddy
Sabitha Indra Reddy

రంగారెడ్డి: ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులను మంత్రి ఓదార్చారు. శంషాబాద్‌లో ప్రియాంక రెడ్డి కుటంబ సభ్యుల నివాసానికి వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించారు. హంతకులను త్వరలోనే పట్టుకొని కఠిన శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిందితులను త్వరలోనే పట్టుకునేందుకు పోలీస్‌ శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోందని మంత్రి అన్నారు. తెలంగాణ మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌ షీ టీమ్స్‌ ప్రవేశపెట్టారని, షీ టీమ్స్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. మహిళలు 112కు ఫోన్‌ చేస్తే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా తమ కూతురును పొట్టనపెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ప్రియాంక రెడ్డి తండ్రి శ్రీధర్‌ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిని కోరాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కిరాతకుల దుర్మార్గానికి బలవ్వగా..కుటుంబ సభ్యులంతా సోకసంద్రంలో మునిగిపోయారు. తండ్రి శ్రీధర్‌ రెడ్డి, తల్లితో పాటు, చెల్లెలు భవ్య ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/