పుట్టిన రోజు సందర్బంగా శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా

వైస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే , మంత్రి రోజా పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంత్రి రోజాతో పాటుగా జబర్దస్త్ నటి వర్షిణి, సింగర్ మంగ్లీ కూడా రోజాతో పాటు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ..జగన్ గారి ఆశీస్సులుతో రాజకీయంగా ఉన్నతమైన స్థానానికి చేరాను అన్నారు. కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకున్నానని.. శ్రీవారిని ఎన్నిసార్లు చూసినా సంతోషంగా ఉంటుంది అన్నారు. తాను అన్నమయ్య సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది అని గుర్తు చేసుకున్నారు. ‘స్వామిని చూడగానే మనం కూడా దేవుడి కుటుంబ సభ్యులుగా ఓ ఫీలింగ్.. తిరుపతి చుట్టుపక్కల వారికి మా స్వామి అని ఫీలింగ్ ఉంటుంది’ అన్నారు. ‘మేం ఎక్కడికి వెళ్లినా తిరుపతి వాళ్లా అంటూ అప్యాయంగా’ పిలుస్తుంటారన్నారు రోజా. అందుకే తిరుపతి ప్రాంతంలో పుట్టడం, రాజకీయాల్లోకి రావడం, మంత్రిగా రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. తనకు ఆరోగ్యం ప్రసాదించమని స్వామివారిని కోరినట్లు తెలిపారు.

1972 వ సంవత్సరం నవంబర్ 17న నాగరాజ రెడ్డి, లలితా దంపతులకు రోజా జన్మించారు. అయితే రోజా పుట్టిన కొన్నాళ్ళకి ఆమె ఈమె కుటుంబం కు షిప్ట్ అయ్యింది. రోజా మాత్రం తన డిగ్రీని తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో పూర్తి చేశారు. రోజా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు కూచిపూడి డాన్సర్ గా పలు ప్రదర్శనలు ఇచ్చారు. అయితే హీరోయిన్ గా రోజా నటించిన మొదటి చిత్రం ‘ప్రేమ తపస్సు’. దివంగత నటుడు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ఈ చిత్రానికి దర్శకుడు. కానీ ఆమె సినీ ప్రయాణం మొదలైంది ‘సర్పయాగం’ అనే చిత్రంతోనే.. అనుకోకుండా శోభన్ బాబు కి కూతురిగా సర్పయాగం సినిమాలో నటించి మెప్పిచింది.

1992 వ సంవత్సరంలో ఇవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారత్నం గారి అబ్బాయి’ చిత్రం ఈమెకు ఊహించని బ్రేక్ ఇచ్చింది. అక్కడి నుంచి రోజా లో వెను తిరిగి చూడాల్సి రాలేదు. ఇక రాజకీయ విషయానికి వస్తే..టీడీపీ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రోజా.. కొంతకాలం తర్వాత వైస్సార్సీపీ లో జాయిన్ అయ్యి రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందారు.. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు.